భారత జాతి గర్వించదగ్గ మహనీయుడు అల్లూరి: కేసీఆర్

భారత జాతి గర్వించదగ్గ మహనీయుడు అల్లూరి: కేసీఆర్

భారతమాత గర్వించదగ్గ ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజని సీఎం కేసీఆర్ అన్నారు.  గచ్చిబౌలి స్టేడియంలో  అల్లూరి 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించారు. రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఎక్కడైతే పీడన, దోపిడి ఉంటుందో అక్కడే మహామహులు ఉద్భవించి ఉద్యమిస్తారన్నారు. 

26 ఏళ్ల వయసులోనే రవి అస్తమించని  బ్రిటీష్ సామ్రాజ్యాన్ని  గడగడలాడించిన  యోధుడు అల్లూరి అని కొనియాడారు కేసీఆర్.  చిన్న వయసులోనే  ప్రజల కష్టాలు చూసి సేవ చేయాలనే గొప్ప ఆలోచనతో యుద్ధరంగంలోకి దిగారన్నారు. భారత జాతి గర్వించదగ్గ మహనీయుడన్నారు. చనిపోతు కూడా దేశం కోసం ప్రాణాలర్పించిన మహా వీరుడు అల్లూరి అని ప్రశంసించారు కేసీఆర్.