డిసెంబర్ 9న మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన : కేటీఆర్

డిసెంబర్ 9న మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన : కేటీఆర్

మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. డిసెంబర్ 9న సీఎం శంకుస్థాపన చేస్తారని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్ట్ ఉంటుందన్నారు. మొత్తం 31 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్ట్కు 6,250 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.

2017 నవంబర్ లో నాగోల్ – అమీర్పేట్ – మియాపూర్ మెట్రో మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. 2018 అక్టోబర్ లో ఎల్బీనగర్ – అమీర్పేట్ మెట్రో లైన్ను ప్రారంభించారు. 2019 మార్చిలో అమీర్పేట్ –హైటెక్ సిటీ మెట్రో లైన్ ను ప్రారంభించారు. జేబీఎస్ – ఎంజీబీఎస్ మెట్రో లైన్ 2020 ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ మెట్రో దేశంలో రెండో పెద్ద మెట్రోగా గుర్తింపు పొందింది.