రేపు సిద్దిపేటలో కేసీఆర్ పర్యటన

రేపు సిద్దిపేటలో కేసీఆర్ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు మంత్రి హరీష్ రావు. ఉదయం 11 గంటలకు మొదట సిద్దిపేటలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ను ప్రారంభించి... తర్వాత సిద్దిపేట పట్టణ శివారులో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు సీఎం. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్. కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహిస్తారన్నారు మంత్రి హరీష్.