- ప్రజావాణి ఇన్చార్జి చిన్నారెడ్డి
హైదరాబాద్, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారానికి ‘సీఎం ప్రజావాణి’ చక్కటి వేదికగా నిలుస్తోందని ప్రజావాణి ఇన్చార్జి, ప్లానింగ్ కమిషన్ వైస్ప్రెసిడెంట్ చిన్నారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారని తెలిపారు.
రెండేండ్ల క్రితం ప్రారంభమైన సీఎం ప్రజావాణి ఇప్పటివరకు 24 సెషన్స్ పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. మొత్తం లక్షా 12 వేల 245 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 64 ,558 దరఖాస్తులు పరిగణలోకి తీసుకొని 47,935 సమస్యలను పరిష్కరించామని వివరించారు. మిగతా 47,687 దరఖాస్తులపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. సీఎం ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పరిశీలించి 74 శాతం సమస్యలను పరిష్కరించామని, దీంతో ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు.
