ఎంపీ సీఎం రమేష్ వాట్సాప్ అకౌంట్ పై నిషేధం

ఎంపీ సీఎం రమేష్ వాట్సాప్ అకౌంట్ పై నిషేధం

ఎంపీ సీఎం రమేష్  వాట్సాప్ అకౌంట్ పై నిషేధం విధించింది వాట్సాప్ సంస్థ. సీఎం రమేష్  వాట్సాప్ సేవలను వాడుకునే హక్కును కోల్పోయారని ఆ సంస్థ వివరించింది. కొద్దిరోజులుగా సీఎం రమేష్ వాట్సాప్ ఖాతా పనిచేయడం లేదు. దీనిపై ఆయన వివరణ కోరుతూ వాట్సాప్ సంస్థకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన వాట్సాప్ సంస్థ వివరణ ఇచ్చింది. సీఎం రమేష్ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు అందాయని అందుకే బ్యాన్ విధించామని తెలిపింది వాట్సాప్ సంస్థ. మరోవైపు తన వాట్సాప్ అకౌంట్ బ్యాన్  వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని సీఎం రమేష్  ఆరోపించారు.