మరో పదేండ్లు మేమే అధికారంలో ఉంటాం..కేసీఆర్ కళ్లకు గంతలు కట్టుకున్న ధృతరాష్ట్రుడు: రేవంత్ రెడ్డి

మరో పదేండ్లు మేమే అధికారంలో ఉంటాం..కేసీఆర్ కళ్లకు గంతలు కట్టుకున్న ధృతరాష్ట్రుడు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోడు దొంగలు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తానంటే అడ్డుకున్న వారు, వరదలు వచ్చినప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై వచ్చే ఫేక్ సర్వేలను నమొద్దని సూచించారు. ప్రజలకు సెంటిమెంట్ కావాలా?డెవలప్మెంట్ కావాలో డిసైడ్ చేసుకోవాలన్నారు. రాబోయే పదేండ్లు తామే అధికారంలో ఉంటామని... జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటమి తప్ప దని స్పష్టంచేశారు. కేసీఆర్ కళ్లకు  గంతలు కట్టుకున్న దృతరాష్ట్రుడి లాంటి వారని విమర్శించారు రేవంత్. 

హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమదేనని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెరిపేస్తే చెరిగిపోయేది కాదని అన్నారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పగించారని.. వాళ్లు చేసిన అప్పులు తీరుస్తూ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే సమయంలో రెండేండ్ల కాంగ్రెస్ పాలనను, పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చవద్దన్నారు.

 ఇవాళ హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో సీఎం మాట్లాడారు. 'కిషన్ రెడ్డి.. గుజరాత్ కు  ఎన్నాళ్లు గులాంగా ఉంటావు. తెలంగాణ అభివృద్ధి నీకు అవసరం లేదా?. తెలంగాణ అభివృ ద్ధికి ఎందుకు సహకరించడం లేదు. మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఎందుకు పర్య టించలేదు?. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరెత్తడం లేదు' అని మండిపడ్డారు. 

కేసీఆర్ తెచ్చిన ఏ పథకాన్నీ రద్దు చేయలే కేసీఆర్ తెచ్చిన ఏ పథకాన్నీ తాను రద్దు చేయలేదని. వాటికి అదనంగా మరిన్ని స్కీమ్స్ అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. నాడు అభివృద్ధిని పక్కన పెట్టి ఎలాంటి ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం, ప్రగ తిభవన్ మాత్రమే నిర్మించారని విమర్శించారు. వాటి వల్ల ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. ఎవరి మీద నిఘా కోసం, ఎవరి వాస్తు కోసం ఇవన్నీ కట్టారని ప్రశ్నించారు. 'నేను ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా నిలిపాను. కులగ ణన చేసి చూపించాం. రాష్ట్ర గీతాన్ని అందించా. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నిధుల దుర్వినియోగం చేసింది.. రూ.20 లక్షలతో నికరంగా ఒక్క ప్రాజె అయినా నిర్మించిందా? కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది. డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి. కాళే శ్వరం లేకున్నా దేశంలో అత్యధిక వరి దిగుబడి వచ్చింది. మేము మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తం' అని తెలిపారు.


కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసింది

కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసింది ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవ డానికి కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. 'అన్ని రంగాల్లో బకాయిలు పెట్టి రూ.8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రా న్ని మాకు అప్పగించారు. తెలంగాణను పూర్తిగా దివాలా తీశారు. తాడు తెగితే పాతాళంలో పడే పరిస్థితికి తెచ్చారు. వాళ్లు దొడ్డు బియ్యం ఇస్తే, మేము సన్న బియ్యం ఇస్తున్నం. ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఎవరో పెద్దోళ్లు తీసుకుంటారనుకునేది. ఇప్పుడు గల్లీగల్లీకి విస్తరించారు. అందుకే ఎవరిది అగ్రికల్చరో.. ఎవరిది డ్రగ్స్ కల్చరో, ఎవరిది పబ్ కల్చరో.. ఎవరిది సామాన్యులతో కలిసి పోయే కల్చరో చూడండి. సినీ కార్మికులతో ఎవరు మాట్లాడుతున్నారో.. సినీ తారలతో ఫామ్ హౌస్ లో ఎవరు ఉంటున్నారో గుర్తు చేసుకోవాలి' అని కోరారు.

రాసిపెట్టుకోండి

జూబ్లీహిల్స్ ప్రజల్లో 80% హిందువులు బీజేపీ వైపు ఉన్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ పోతుంది. రాసిపెట్టుకోండి. మీరు ఓడిపోతే హిందువులు మీతో లేరుఅని భావించాలి. బీఆర్ఎస్ గెలుపు కోసం జూబ్లీ హిల్స్ బీజేపీ పనిచేస్తోంది. బీఆర్ఎస్ విలీనమైతే వచ్చే లాభం పై ఇక్కడ రెండు పార్టీలు లిట్మస్ టెస్ట్ చేసుకుంటున్నాయి' అని అన్నారు.