
ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాజీమంత్రి హరీశ్ కు సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా కౌంటర్ వేశారు. రాజీనామా చేయాలని తాము ఎవర్నీ అడగబోమన్నారు. సవాలు చేసిన వారిని మేం రాజీనామా చేయమని మేం అడగం..ఎలాగు వారు పారిపోతారని తెలుసు. అయితే కాంగ్రెస్ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సోనియా,రాహుల్ గాంధీ మాటిస్తే అది శిలాశాసనం... రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్లు మాటివ్వబోరని చెప్పారు రేవంత్.
అయితే సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ట్విట్టర్లో స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు.. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా రేవంత్ వెన్నుచూపి పారిపోయారని విమర్శించారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయారు. రేవంత్ రెడ్డి నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది. మరోసారి చెబుతున్నా ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేస్తే నేను రాజీనామాకు సిద్ధం అని హరీశ్ ట్వీట్ చేశారు.