హైదరాబాద్: ప్రధాని మోదీన ప్రారంభించనున్న కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానించింది. 2026 మే 10న తెలంగాణకు రానున్న మోదీ.. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ (HICC) వేదికగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం అధికారికి ఆహ్వానం పంపింది.
ప్రధాని మోదీ వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభోత్సవం, హైదరాబాద్-పనాజీ ఎకానమిక్ కారిడార్‌లోని గుడెబల్లూర్-మహబూబ్‌నగర్ నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ పనులను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా.. కేంద్ర ప్రభుత్వం తరఫున జాతీయ రహదారుల శాఖ రీజినల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ ఆహ్వాన పత్రిక అందజేశారు.
►ALSO READ | బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు... బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు: ప్రధాని మోడీ ట్వీట్..
