ప్రధాని మోడీ మే 10న తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోడీ. అనంతరం హైదరాబాద్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు మోడీ. ఈ క్రమంలో రాష్ట్ర పర్యటనకు ముందే ఎక్స్ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు మోడీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని...బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మోడీ.
బీజేపీకి మద్దతు పెరుగుతోందని..ఇక తెలంగాణ ప్రజల మొదటి ఎంపిక బీజేపీ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు మోడీ. మే 10న కర్ణాటక తెలంగాణలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటానని.. ఉదయం 11 గంటలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపనకు 45 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటానని అన్నారు. సమాజ సేవ అనే మా విలువలకు అనుగుణంగా, ఈ సంస్థ అనేక రంగాల్లో ప్రశంసనీయమైన సేవలు అందిస్తోందని కొనియాడారు మోడీ.
నేను రేపు, మే 10న, కర్ణాటక, తెలంగాణల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాను.
— Narendra Modi (@narendramodi) May 9, 2026
ఉదయం 11 గంటలకు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 45 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటాను. సమాజానికి సేవ చేయాలనే మన విలువలకు అనుగుణంగా, ఈ సంస్థ అనేక రంగాల్లో ప్రశంసనీయమైన సేవలు…
మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకుని సుమారు రూ. 9వేల 500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తానని.. వాటికి శంకుస్థాపనలు చేస్తానన్నారు ప్రధాని మోడీ. ప్రాజెక్టులు రహదారులు, లాజిస్టిక్స్, టెక్స్టైల్స్, రైల్వేలు, ఎనర్జీ తదితర రంగాలను కవర్ చేస్తాయని అన్నారు. అనంతరం సింధు హాస్పిటల్ ను దేశానికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటానన్నారు ప్రధాని మోదీ.
►ALSO READ | ప్రధాని మోడీకి కవిత బహిరంగ లేఖ: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా 4 కీలక డిమాండ్లు
