హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం ( మార్చి 8 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. మహిళలు శాంతియుతంగా పెద్ద యుద్ధాన్నే గెలవచ్చని అన్నారు. మహిళలకు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని.. మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలనుకున్నామని అన్నారు సీఎం రేవంత్. మహిళలకు ఇప్పటికే ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామని.. SIBలో IGగా మహిళనే నియమించామని పేర్కొన్నారు సీఎం రేవంత్.
మావోయిస్టుల లొంగుబాటులో మహిళా IG పాత్ర కీలకమని అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యత కూడా అప్పగించామని అన్నారు సీఎం రేవంత్. మహిళల ట్యాలెంట్ ను గుర్తించాలని కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఇందిరా మహిళా శక్తి అని ప్రత్యేకంగా ఒక బజార్ ఏర్పాటు చేశామని.. కీలక శాఖలను మహిళలు సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారని అన్నారు.మహిళలు ప్రభుత్వ అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకెళ్లాలని అన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లోనూ మహిళల పట్ల వివక్ష ఉందని.. మన దగ్గర కూడా వివక్ష ఉంది.. అది తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు సీఎం రేవంత్. 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వెల్లడించారు సీఎం రేవంత్. హైదరాబాద్ లో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఉన్నాయని.. కాలుష్యాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు సీఎం రేవంత్.
