
హైదరాబాద్ లక్డీకాపూల్‌లో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని AICC జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి జులై 4న ఆవిష్కరించారు. రోశయ్య జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేసి వేణుగోపాల్ ,సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,జూపల్లి కృష్ణారావు ఎంపీలు , నగర మేయర్, ఆర్యవైశ్య సంఘాలు,రోశయ్య అభిమానులు పాల్గొన్నారు.
లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ సమీపంలో 9 అడుగుల ఎత్తు, 450 కిలోల బరువుతో రోశయ్య విగ్రహాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా రోశయ్యకు ఘన నివాళులర్పించింది.
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకే దక్కిందన్నారు సీఎం రేవంత్ . ఆయన మచ్చలేని నాయకుడని చెప్పారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా రాజీనామా చేసిన తర్వాత తమిళనాడు గవర్నర్‌గా కూడా ఆయన సేవలందించారని సీఎం గుర్తుచేశారు.