చింతకాని: రైతు ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం..సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల

చింతకాని: రైతు ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం..సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల

చింతకాని, వెలుగు: ఈ నెల 10న ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం(మత్కెపల్లి క్రాస్ రోడ్) వద్ద నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం కలెక్టర్ దివాకర్ టీఎస్, సీపీ సునీల్ దత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి పరిశీలించారు. సభా వేదిక, హెలీప్యాడ్, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, రహదారులు, భద్రత, ట్రాఫిక్ తదితర ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే రైతు ఆశీర్వాద సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. 

ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలిస్తున్నామని, సాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.       

ఖమ్మం టౌన్: ఖమ్మం సిటీలోని 58వ డివిజన్ బీసీ కాలనీలో నిర్మించనున్న సీసీ డ్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.