
అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తానన్న మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. కేసీఆర్ చీల్చి చెండాడుతా అంటే తాము బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ వేసుకొని వచ్చానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారంటే.. మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి10 గంలకే అసెంబ్లీ అయితే ఉదయమే 9.30 గంటలకే వచ్చారన్నారు. సినిమా డైలాగులు ఆపి..సబ్జెక్ట్ పై చర్చకు రావాలన్నారు. ధరణి మీద పాలసీ తెస్తామని.. బీఆర్ఎస్ సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు.
కేటీఆర్ 100శాతం ఆర్టిఫీషియల్, సున్నా శాతం ఇంటెలిజెన్స్ అని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్..సభలో లేని అధికారుల గురించి మాట్లాడటం కేటీఆర్ కు తెల్వదా అని ప్రశ్నించారు. ముచ్చర్లలో గొప్ప నగరం సృష్టిస్తున్నామని చెప్పారు రేవంత్. ముచ్చర్లలో నాలుగో నగరాన్ని నిర్మిస్తున్నాం.మన భవిష్యత్ నగరంగా ముచ్చర్ల కాబోతుంది.. మెట్రో సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. ఎన్నికలైపోయాయి కాబట్టి బీఆర్ఎస్ ప్రతిపక్షం పాత్ర పోషించాలన్నారు.