డీలిమిటేషన్ పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పెంచానుకుంటున్న సగం సీట్లు జనాభా ఆధారంగా..మిగతా సగం రాష్ట్రాల ఆర్థిక వృద్ధి రేటు ఆధారంగా పెంచాలన్నారు రేవంత్. డీలిమిటేషన్ కు 2028 వరకు టైముందని హడావుడి చేయొద్దన్నారు. డీలిమిటేషన్ పై ఎక్స్ పర్ట్ కమిటీ వేయాలని..అసెంబ్లీల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. నార్త్, సౌత్ రాష్ట్రాల మధ్య గ్యాప్ మంచిది కాదన్నారు రేవంత్
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
- డీలిమిటేషన్ పార్టీలకు ,ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు
- డీలిమిటేషన్ పై కేంద్రం హడావుడి చేస్తోంది.
- మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రం ప్రత్యేకంగా పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేసింది
- మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ఒకే అంశంగా చూపిస్తోంది
- మహిళా కోటా, డీలిమిటేషన్ కు సంబంధం లేదు
- మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమని ప్రచారం చేస్తోంది.
- మహిళలకు ఓటు హక్కు సహా, సమాన హక్కులు కల్పించింది కాంగ్రెస్సే
- మహిళలకు అనేక రాజ్యాంగబద్ధ పదవుల్లో కాంగ్రెస్ అవకాశాలు కల్పించింది
- స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు తెచ్చిందే కాంగ్రెస్
- డీలిమిటేషన్ పై మోదీకి బహిరంగ లేఖ రాశాం
- డీలిమిటేషన్ దేశ ప్రజలకు సంబంధించిన కీలక అంశం
- కేంద్రం హడావుడితో ప్రజలకు శాశ్వత నష్టం జరుగుతుంది
- 2013లో మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నదే బీజేపీ
- మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు సోనియా ఆలోచించారు
- 2023లో బిల్లు పాసైతే ..2024 ఎన్నికల్లో మహిళా కోటా అమలు చేయాలని కోరాం
- మోదీ సర్కార్ కు చిత్తశుద్ధది లేకనే కోటా బిల్లును 2034కి పెట్టింది
- మహిళలకు రిజర్వేషన్లు దూరం చేసింది ఎన్డీఏ సర్కారే
- 2011 జనాభా ప్రతిపాదికన మహిళా రిజర్వేషన్లా.?
- చిత్తశుద్ధి ఉంటే 543ఎంపీ స్థానాల్లో 33 శాతం కోటా ఇస్తే 181 సీట్లు వస్తాయి
- మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్లో రాజకీయ కుట్ర ఉంది
- మహిళా రిజర్వేషన్లకు మా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం
- ఉన్న సీట్ల ఆధారంగానే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలి
- 1976లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది
- డీలిమిటేషన్ ను కేంద్రం రాజకీయ పావుగా వాడుకుంటుంది
- దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ అమలు చేశాయి
- ఉత్తరాదిలో జనాభా నియంత్రణ జరగలేదు
- రాష్ట్రాల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఉండాలి
- జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఉంటే నష్టం
- దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమని మేం మోదీకి లేఖ రాశాం
- ఇపుడున్న సీట్లకు 50 శాతం పెంచినా దక్షిణాదికి అన్యాయమే
- జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచినా దక్షిణాదికి తీవ్ర నష్టం
- ప్రస్తుతం ఉన్న సీట్లలో ఉత్తరాది- దక్షిణాదికి గ్యాప్ 412 సీట్లు
- సీట్లు పెంచిన తర్వాత నార్త్, సౌత్ గ్యాప్ 620 సీట్లు
- ఉత్తరాదికి 208 సీట్లు అదనంగా వస్తాయి
- జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి నష్టం
- ఈ విధానాన్ని అమలు చేయబోమని దక్షిణాది రాష్ట్రాలు ప్రకటించాయి
- దక్షిణాదికి ముఖ్యమైన ఏ శాఖను బీజేపి ఇవ్వడం లేదు
- రాజకీయంగా మనల్ని ద్వితీయ శ్రేణులుగా మార్చే కుట్ర
- ఢిల్లీ, పంజాబ్ రాజకీయంగా మనుగడ కోల్పోయే ప్రమాదం
- సీట్లు పెంచాతమంటే ఏ ప్రాతిపదికన పెంచుతారో అఖిలపక్షం పిలవాలి
- ఉత్తరాది, దక్షిణాదికి గ్యాప్ మంచిది కాదు
- పొలిటికల్ సెంటర్లుగా నార్త్ రాష్ట్రాలు పెరుగుతున్నాయి
- పన్నులు కట్టం, సలాం కొట్టే విధానికి మేం వ్యతిరేకం
- 50 శాతం సీట్లు పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పాడు
- శిఖండిని అడ్డుపెట్టుకున్నట్టుగా మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుపెట్టుకుంటున్నారు
- ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్, దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్స్
- రాష్ట్రాల జీఎస్ డీపీ ఆధారంగా డీలిమిటేషన్ లో ప్రాధాన్యత ఇవ్వాలి
- దేశానికి అత్యధిక ఆదాయం ఇచ్చే దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా.?
- డీలిమిటేషన్ బిల్లుపై విస్తృత చర్చల తర్వాత నిర్ణయం తీసుకోవాలి
- పెంచాలనుకుంటున్న 273 సీట్లను సగం జనాభా ఆధారంగా..సగం ఆర్థిక వృద్ధి రేటు ఆధారంగా పెంచాలి
- డీలిమిటేషన్ కు 2028 వరకు టైముంది
- ఎక్స్ పర్ట్ కమిటీ వేయండి, అసెంబ్లీ అభిప్రాయాలు తీసుకోండి
- జనగణన పూర్తయ్యే వరకు సంప్రదింపులు చేయండి.

