
హైదరాబాద్: ఎన్నికలప్పుడే రాజకీయాలని.. ఆ తర్వాత అందరం ఒక్కటేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం (మే 8) హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేం తల్చుకుంటే పాకిస్థాన్ ను మట్టిలో కలిపేస్తాం.. కానీ సంయమనం పాటిస్తున్నామన్నారు.
మీకు స్వాతంత్ర్యం ఇచ్చిందే మేమని.. మేం తల్చుకుంటే పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండదని హాట్ కామెంట్స్ చేశారు. మా దేశ సింధురాన్ని మీరు తుడిపేయాలనుకుంటే.. ఆపరేషన్ సిందూరే మీకు సమాధానమని కౌంటర్ ఇచ్చారు. పహల్గాం టెర్రర్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్ అంశంలో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.
►ALSO READ | హైడ్రా అంటే కూలగొట్టడానికి కాదు.. హైదరాబాద్ నగరాన్ని నిర్మించడానికి: సీఎం రేవంత్
జవాన్లకు అండగా నిలిచేందుకు అంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇండియన్ ఆర్మీకి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారీగా జాతీయ జెండాలు ప్రదర్శించారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు.