ఆత్మకూరులో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

ఆత్మకూరులో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అమరచింత మున్సిపాలిటీల పరిధిలో రూ. 151.92 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్.  

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ. 15 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 121.92 కోట్లతో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన  చేశారు.   50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి,  రూ. 15 కోట్లతో అమరచింత మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రేవంత్.