V6 News

శరద్ పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ బర్త్ డే విషెస్

శరద్ పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ బర్త్ డే విషెస్

ఎన్సీపీ అధినేత శరద్‌‌‌‌‌‌‌‌ పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సీఎం రేవంత్ ​రెడ్డి బర్త్​ డే విషెస్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​.. బుధవారం పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నివాసంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నెల 12తో శరద్ పవార్ 85 వసంతాలను పూర్తి చేసుకోబోతు న్నారు. ఈ నేపథ్యంలో తన నివాసంలో పొలిటికల్ లీడర్లు, ప్రముఖులకు విందు ఏర్పాటు చేశారు. 

సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డితో పాటు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీని కూడా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి కలిశారు.  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌పై వారు కాసేపు చర్చించుకున్నారు.- న్యూఢిల్లీ, వెలుగు