Mahrah Al Nahyan: అబుదాబి రాజ కుటుంబానికి చెందిన ఒక మహిళ లండన్ వీధుల్లో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. లండన్ వీధిల్లో ఆమె స్పృహ కోల్పోయి పడి ఉండగా, ఆమె పక్కనే మూడేళ్ల చిన్నారి చెప్పులు లేకుండా అత్యంత రద్దీగా ఉన్న రోడ్డు పక్కన ఆడుకుంటున్న సంఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి ఆమె కోర్టులో చిన్నారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కేసు నమోదు అయింది.
అసలు ఏం జరిగింది?:
గత జూన్ 13వ తేదీన లండన్లోని ఒక రద్దీగా ఉండే వీధిలో మహ్రా అల్ నహ్యాన్ (32) అనే మహిళ, మరో వ్యక్తితో కలిసి అపస్మారక స్థితిలో (స్పృహ లేకుండా) రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్కు ఆనుకుని పడి ఉంది. అదే సమయంలో వారి పక్కనే మూడేళ్ల చిన్నారి భారీగా ట్రాఫిక్ ఉన్న రోడ్డు పక్కనే ఆడుకుంటోంది. ఇది గమనించిన దారినపోయే వారు వెంటనే జోక్యం చేసుకుని ఆ పిల్లాడిని రక్షించి అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, ఆమె సుమారు అర్థ గంట (30 నిమిషాల) పాటు స్పందించలేదని గుర్తించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె విచిత్రంగా ప్రవర్తించినట్లు న్యాయస్థానాకి తెలిపారు. ఆమె దగ్గర డ్రగ్స్ తీసుకునే వస్తువులు దొరికాయి. అయితే సంఘటన జరిగిన రోజు ఆమె డ్రగ్స్ తీసుకోలేదని, అంతకుముందు రోజు కొకైన్ వాడటం వల్ల విపరీతమైన అలసట కారణంగా ఇలా జరిగిందని నహ్యాన్ తరఫు లాయర్ కోర్టులో వాదించారు.
►ALSO READ | చికాగో హిందూ ఆలయంలో మారణ హోమానికి యత్నం.. కుట్ర భగ్నం: తుపాకీ జామ్ కావటంతో బతికిపోయిన జనం
ఎవరు ఈ మహ్రా అల్ నహ్యాన్?:
* అబుదాబిని ఏలే ప్రముఖ అల్ నహ్యాన్ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న 32 ఏళ్ల మహ్రా అల్ నహ్యాన్ నెలకు సుమారు 8 వేల పౌండ్ల అలవెన్స్ పొందుతున్నారు. చిన్నారిని సరిగ్గా చూసుకోకుండా నిర్లక్ష్యం చేసిన కేసులో ఆమె దోషిగా తేలారు.
* ఈ కేసును విచారించిన లండన్ కోర్టు ఆమెకు రెండేళ్ల కమ్యూనిటీ ఆర్డర్ (పునరావాస కార్యక్రమాలతో కూడిన శిక్ష) విధించింది. అంతేకాకుండా ఆమెకు మొత్తం £6,114 (సుమారు రూ. 6.5 లక్షలు) జరిమానా విధించినట్లు కోర్టు వర్గాలు వెల్లడించాయి.
#LATEST : Abu Dhabi Royal Found Passed Out on London Street With Toddler After Cocaine Use Mahrah Al Nahyan, 32, a member of Abu Dhabi’s royal family through marriage, was found unconscious on a London street while a barefoot three-year-old child played dangerously close to traffic. According to court reports, she had used cocaine in the days before the June 2026 incident. Bystanders intervened to protect the child until authorities arrived. She pleaded guilty to child neglect and was sentenced to a two-year community order with rehabilitation requirements, along with a fine and court costs. #MahrahAlNahyan #London #UAE #RoyalFamily #Cocaine
— upuknews (@upuknews1) October 15, 2026
مهرة آل نهيان، مسكوها بسبب تعاطي الكوكايين ولا بسبب إهمال طفل كان تحت رعايتها؟ وش السالفة بالضبط؟ العائلة الحاكمة في أبوظبي ليش ما تلتفت لحالها وين الرحمة والاحتواء ليش هالمظلومة وصلت لهالحال؟ إذا صدق يهمكم الإصلاح، ابدوا من داخل بيتكم #رحله_المليون84 #اذا_غضبوا_غضبنا #الامارات https://t.co/6Pw9WxDpt8
— ليلی التميمي (@LylaaaTm) October 14, 2026
Une membre de la famille royale d'Abu Dhabi a été retrouvée effondrée dans la rue après une overdose alors qu'elle s'occupait d'un enfant de trois ans, a-t-on appris devant le tribunal. Mahrah Al Nahyan, 32 ans, a été retrouvée affalée sur une rambarde près d'un homme inconscient après avoir pris de la cocaïne, tandis qu'un tout-petit pieds nus jouait au bord d'une route très fréquentée.
— Claire Langoulant ⚜️♛ (@Cuisines1974) October 14, 2026
