కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు రేవంత్ . రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు.

అంతకుముందు కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి సబంధించిన విభజన అంశాలు, నిధుల రాకపై  చర్చించారు. అ తర్వాత కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావాత్ తోనూ రేవంత్ భేటీ అయ్యారు.

పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని వినతిపత్రం అందించారు.సీఎం రేవంత్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, HMDA జాయింట్ డైరెక్టర్ ఆమ్రపాలి ఉన్నారు. 


సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి గురువారం (జనవరి 4) బయల్దేరి వెళ్లారు. ఉదయం 11 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ భేటీ జరిగింది.

రాహుల్ గాంధీ చేపటనున్న భారత్ న్యాయ యాత్ర పై లోక్ సభ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలన్నదాని పై చర్చించారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, హాజరయ్యారు.  లోక్ సభ ఎన్నికల్లో పొత్తులు, పై ఎత్తుల విషయం, తెలంగాణలో ఖాళీగా ఉన్న నామినేటడ్ పోస్టుల విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది.