కాళోజీకి సీఎం రేవంత్ నివాళి

కాళోజీకి సీఎం రేవంత్ నివాళి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. మంగళవారం తన అధికారిక నివాసంలో ఎంపీలతో కలిసి కాళోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎంపీలతో సీఎం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్​లో పాల్గొన్నారు. 

రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం పార్లమెంట్ కు వెళ్లి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలతో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్​లో స్పీకర్ ఓంబిర్లాను మర్యాద పూర్వకంగా కలిసి.. పలు అంశాలపై చర్చించారు.