గద్దర్ ఆటపాట, పోరాటస్ఫూర్తి ప్రజల మధ్య శాశ్వతంగా ఉంటయ్: సీఎం రేవంత్

గద్దర్ ఆటపాట, పోరాటస్ఫూర్తి ప్రజల మధ్య శాశ్వతంగా ఉంటయ్: సీఎం రేవంత్

హైదరాబాద్: ప్రజా యుద్ధనౌక, తెలంగాణ పోరాటయోధుడు గద్దర్ పాటలు, ఆలోచనలు, పోరాటస్ఫూర్తి ప్రజల మధ్య శాశ్వతంగా జీవిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) జయంతి (జనవరి 31) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఘన నివాళులర్పించారు. అణచివేతకు వ్యతిరేకంగా తన ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన పోరాటవీరుడు గద్దర్ అని ఆయన స్మరించుకున్నారు. 

సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన గొంతుక గద్దర్ అని కొనియాడారు. గద్దర్ జయంతిని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, ఆయన పేరుతో అవార్డును నెలకొల్పి ప్రతి ఏటా కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.