 
                                    వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం రేవంత్ సమ్మయ్య నగర్, పోతన నగర్, రంగంపేటలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద రూ. 15 వేలు అందించనున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్.
పంట నష్టం అంచనా వేయాలని.. పంట నష్టం అంచనాలో ప్రజా ప్రతినిధులను తీసుకెళ్లాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపితే ఊరుకోమని అన్నారు. పేరుకుపోయిన చెత్తనంతా క్లియర్ చేయాలని.. ఓరుగల్లును త్వరగా పునరుద్దరించాలని అన్నారు సీఎం రేవంత్.
నాలాలపై అక్రమ నిర్మాణాలు గుర్తించి వెంటనే తొలగించాలని ఆదేశించారు సీఎం రేవంత్.అన్ని శాఖలతో సమన్వయంగా ముందుకెళ్లాలని.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని అన్నారు. బాగా దెబ్బతిన్న ఇందిరమ్మ ఇండ్లకు స్పెషల్ కోటా కింద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.

 
         
                     
                     
                    