పనిచేసే వాడిని, మంచోడిని గ్రామ సర్పంచ్ గా ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వీలైనంత వరకు సర్పంచ్ లను ఏకగ్రీవం చసుుకోవాలని సూచించారు. పొంకనాలు కొట్టే వాడిని సర్పంచ్ గా ఎన్నుకోవద్దని చెప్పారు రేవంత్.
ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా హుస్నాబాద్ బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్.. ఎడ్యుకేషన్,ఇరిగేషన్ పై మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. నెహ్రూ స్పూర్తితోనే మేం ముందుకెళ్తున్నాం. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయ్యింది. ఆనాడు ఎస్ఆర్ఎస్పీని నెహ్రూ కడితే ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆనాడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులే దేశానికి సేవలు అందిస్తున్నాయి. రూ.2 లక్షల రుణామాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మాదే. వ్యవసాయం దండగ కాదు..పండగ చేసి నిరూపించాం. లక్షా4 వేల కోట్లు రైతుల కోసం మా ప్రభుత్వం ఖర్చు చేసింది. మహిళలకు ఫ్రీ బస్సులే కాదు..బస్సు ఓనర్లను చేశాం. సోలార్ పవర్ ప్లాంట్లను ఆడబిడ్డలకు అప్పగించాం. అడిగిన ప్రతీ పేద ఇంటికి రేషన్ కార్డు ఇచ్చాం. ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే పశువులకు దాణ పెట్టేవాళ్లు. మా ప్రభుత్వం వచ్చాక సన్నబియ్యం ఇస్తున్నాం. ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లునిర్మిస్తున్నాం. హుస్నాబాద్ లో దేవుళ్లేమైనా పాలించారా?. హుస్నాబాద్లో గౌరెళ్లి రిజర్వాయర్ ఎందుకు పూర్తి కాలేదు. పదేండ్లు హుస్నాబాద్ నిర్లక్ష్యానికి గురైంది. గౌరెళ్లి రిజర్వాయర్లు పూర్తి చేసే భాద్యత నాది. ఆనాడు సిద్దిపేట,సిరిసిల్ల ,గజ్వేల్ నియోజకవర్గాలే అభివృద్ధి అయ్యాయి. ఐటీఐ కాలేజీలన్నింటిని ఏటీసీలుగా మార్చాం. ఏటీసీలో చేరే ప్రతి విద్యార్థికి నెలనెలా రూ.2వేలు ఇస్తున్నాం. అని రేవంత్ అన్నారు.
త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీ
బహుజన సామ్రాజ్యం కోసం సర్దార్ సర్వాయి పాపన్న పునాదులు వేశారు. 2001లో ఈప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైంది. 2004న ఈ కరీంనగర్ గడ్డపై సోనియా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 60 ఏండ్ల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు సోనియా. గ్లోబల్ సమ్మిట్ కు రావాలని సోనియాను ఆహ్వానించా. శ్రీకాంత చారి ఆత్మబలిదానంతోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైంది. యువత ఆకాంక్షలను గుర్తించి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. త్వరలోనే 40 వేల ఉద్యోగాల ప్రకటన చేయబోతున్నాం. రెండున్నరేండ్ల పాలన పూర్తయ్యేసరికి లక్ష ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తాం. అని రేవంత్ అన్నారు.
