హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బుమ్ రుకున్ ఉద్ దౌల చెరువును ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని చెరువులు, కుంటల పునరుద్ధరణ చేపట్టిన హైడ్రా బుమ్ రుకున్ ఉద్ దౌల చెరువు సుందరీకరణ చేపట్టింది. ఆదివారం ( మార్చి 8 ) చెరువును ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. నగర అభివృద్ధిలో భాగంగా, నిజాం మనకు ఇచ్చిన ఆస్తి బూమ్ రుకున్ ఉద్ దౌల చెరువు అని...ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అనేక డెవెలప్ మెంట్ పనులు చేపడుతున్నామని అన్నారు. ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని..బుమ్ రుకున్ ఉద్ దౌల చెరువును కూడా డెవెలప్ చేస్తామని అన్నారు.
కాలుష్యమైన వాతావరణాన్ని దూరం చేసి మంచి గాలి, మంచి వాతావరణం ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుందని అన్నారు సీఎం రేవంత్.ఇండియాలోనే హైదరాబాద్ మంచి నగరం.. అలాంటి నగరం ఇపుడు ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి నగరాన్ని మళ్ళీ నెంబర్ 1 చెయ్యడానికి పూనుకున్నామని..అలాంటి నగరానికి 150 ఏళ్ల క్రితం నిజం అన్ని ఇచ్చారని అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం రాబోయే రోజుల్లో దృష్టి పెడతామని.. సిటీని డెవెలప్ చేసేందుకు MIM పూర్తి మద్దతు ఇస్తోందని వెల్లడించారు సీఎం రేవంత్. ఆక్రమణ కు గురైన చెరువులను, పార్కులను, నాళాలను కాపాడటం, మంచి పర్యాటక కేంద్రంగా మార్చాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. అంబర్ పేట చెరువు ను కబ్జా చేస్తే.. మేము కటినంగా వ్యవహరించి మళ్ళీ బతుకమ్మ కుంటను పునరుద్ధరణ చేశామని అన్నారు.
బూమ్ రుకున్ ఉద్ దౌల చెరువును కూడా మంచిగా డెవెలప్ చేస్తామని..చెరువుల దగ్గర లేక్ పోలీసులను ఏర్పాటు చెయ్యాలని ఆదేశించామని అన్నారు. డెవెలప్ చేసిన చోట లేక్ ఎకానమీ సృష్టించేందుకు ఆదేశిస్తున్నానని అన్నారు. మహిళలు ఈ డెవెలప్ అయిన చెరువుల వద్ద వ్యాపారం చేసుకోవచ్చని అన్నారు. మూసి కూడా డెవెలప్ చేసి, ముసి వద్ద నైట్ మొత్తం వ్యాపారం చేసేందుకు అవకాశం కల్పిస్తామని..నిరుద్యోగులు, వ్యాపారవేత్తలు మూసి ఒడ్డున వ్యాపారం చేసుకోవచ్చని అన్నారు సీఎం రేవంత్.
మూసి పరిసరాల్లో ఎవరికి ఇబ్బంది కాకుండా చేస్తామని.... ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కూడా ఇస్తాం.. ఎవరికి అన్యాయం చెయ్యమని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. కూల్చివేతలు చేస్తున్నపుడు అనేక మంది హైడ్రాను తిట్టారని... ఇపుడు అందరూ సంతోషిస్తున్నారని అన్నారు.రంజాన్ లో బిర్యానీ, కుర్బని తినిపిస్త, ఓల్డ్ సిటీ కోసం నిధులు కూడా విడుదల చేస్తానని అన్నారు.ఓల్డ్ సిటీ లో ఎన్ని డెవెలప్ మెంట్ పనులు జరుగుతున్నాయో చూడండని అన్నారు సీఎం రేవంత్.
