క్యాన్సర్ బాధిత బాలుడికి అండగా సీఎం

క్యాన్సర్ బాధిత బాలుడికి అండగా సీఎం
  • తక్షణం వైద్య సాయం అందించాలని ఆదేశాలు

హైదరాబాద్ , వెలుగు : వరంగల్ లో తనను కలవలేకపోయిన క్యాన్సర్ బాధిత బాలుడు మహమ్మద్ ఆదిల్ అహ్మద్ ఉదంతంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే వైద్య సాయం అందించాలని సీఎంవో అధికారు లను ఆయన ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసు లు బాలుడి కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు.

నెల రోజుల క్రితం ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి లక్ష రూపాయల ఎల్వోసీ మంజూరు చేసిన విషయం, ప్రస్తుతం ఆదిల్ అహ్మద్ ఆరోగ్య పరిస్థితి పై అడిగి తెలుసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా కావాల్సిన మరింత సాయం అందిస్తామని ఆదిల్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.