ఇవాళ ( మార్చి 24 ) డీలిమిటేషన్​పై అసెంబ్లీలో తీర్మానం

ఇవాళ ( మార్చి 24 ) డీలిమిటేషన్​పై అసెంబ్లీలో తీర్మానం
  • ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్​
  • అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాల సేకరణ

హైదరాబాద్, వెలుగు: 25 ఏండ్లపాటు డీలి మిటేషన్​ వాయిదా వేయాలని, జనాభా దామాషా, ప్రొరేటా ప్రకారం లోక్​సభ నియో జకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో సోమవారం తీర్మానం చేయనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్​పై వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ  తీర్మానాన్ని సీఎం  రేవంత్​ రెడ్డి సభలో ప్రవేశ పెడతారు. అనంతరం సభలోని రాజకీయ పక్షాలు అభిప్రాయాలు వెల్లడించనున్నాయి. 

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​ నేతృత్వంలో డీలిమిటేషన్​పై చెన్నైలో నిర్వహించిన  దక్షిణా ది రాష్ట్రాల రాజకీయ పార్టీల జేఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్​కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఈ మీటింగ్​లో సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. డీలిమిటేషన్​పై త్వరలోనే హైదరాబాద్​లో జేఏసీ తదుపరి సమావేశం నిర్వహిస్తామని, ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తామని తెలిపారు. 

ఈ నేపథ్యంలోనే  సోమవారం సభలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించనున్నారు. రాష్ట్రంలో డీలిమిటేషన్​ను బీజేపీ మినహా మిగిలిన పక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి.  తమ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గేలాచేసి  నామమాత్రం చేసేలా బీజేపీ కుట్ర చేస్తున్నదని దక్షిణాది రాష్ట్రాలు పేర్కొంటున్నాయి. జనాభా ఆధారంగా లోక్​స‌‌‌‌‌‌‌‌భ స్థానాల పెంపును మ‌‌‌‌‌‌‌‌రో 25 ఏండ్ల పాటు వాయిదా వేయాలని డిమాండ్​ చేస్తున్నాయి. అది సాధ్యం కాకుంటే రాష్ట్రాలు సూచించే ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాయి.