- ఎన్‌ఐయూఎం క్యాంపస్‌కు శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఫ్యూచర్ సిటీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించనున్నారు. అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం) క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు పోలీస్ కమిషనరేట్‌ను సీఎం ప్రారంభిస్తారు.
సాయంత్రం 5.30 గంటలకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని సందర్శించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఎన్‌ఐయూఎం క్యాంపస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాల తర్వాత ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
