నేడు (అక్టోబర్ 7 ) ఢిల్లీకి సీఎం రేవంత్  

నేడు (అక్టోబర్ 7 ) ఢిల్లీకి సీఎం రేవంత్  

హైదరాబాద్, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న తీవ్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండియా కూటమి ఎంపీలు, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు అడ్డుకుని అకస్మాత్తుగా అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

తమ నేతలతో పోలీసులు వ్యవహరించిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో పార్టీ హైక మాండ్‌కు అండగా నిలిచేందుకు ఆయన అత్యవసరంగా ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలిసింది. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.