ప్రపంచంతో పోటీపడేటా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీకి భూమి పూజ చేసిన రేవంత్ . ఫ్యూచర్ సిటీ కేవలం ఒక నగరం కాదు, ఇది రాబోయే తరాల తలరాతను మార్చే అద్భుతమన్నారు. జూన్ లో ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
ఈ నగర నిర్మాణం అంత సులభం కాదు. ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఫ్యూచర్ సిటీలో కలవాలనుకునే గ్రామాలు... గ్రామ సభల్లో తీర్మానం చేసి ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.జపాన్, జర్మనీ, సింగపూర్ వంటి దేశాల్లోని అత్యాధునిక నగరాల తరహాలో, భారత్‌లోనే నాలుగో నగరంగా దీన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
60 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. మనకున్న అద్భుతమైన ORR, ఐటీ ఎగుమతులు, కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో మన ఘనతలే ఈ నగరానికి స్ఫూర్తి అని తెలిపారు. ఫ్యూచర్ సిటీ కోసం భూములిచ్చిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ఈ నగర నిర్మాణానికి సహకరించే వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. వచ్చే జూన్ నెలలో ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు.

