సింగరేణి కార్మికుల ఫిర్యాదుల స్వీకరణకు వాట్సాప్ నెంబర్ : సింగరేణి సీఎండీ

సింగరేణి కార్మికుల ఫిర్యాదుల స్వీకరణకు వాట్సాప్ నెంబర్ : సింగరేణి సీఎండీ
  • త్వరలో హైదరాబాద్‌‌‌‌లో కార్పోరేట్​హాస్పిటల్: సింగరేణి సీఎండీ 

హైదరాబాద్​, వెలుగు: సింగరేణి కార్మికుల ఫిర్యాదులకు, వాటిని త్వరగా పరిష్కరించేందుకు త్వరలో ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేస్తామని సంస్థ సీఎండీ ఎన్. బలరాం ప్రకటించారు. శనివారం ఆయన ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 40 మంది కార్మికులు ఫోన్ చేసి తమ ఇబ్బందులను సీఎండీకి తెలియజేశారు.

ఈ సందర్భంగా బలరామ్ మాట్లాడుతూ..కార్పోరేట్ ఆస్పత్రుల్లో కార్మికులకు  వైద్య సేవల్లో జాప్యం తొలగించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌‌‌‌లో కొత్త కార్పోరేట్ హాస్పిటల్ ప్రారంభిస్తామన్నారు. రామగుండం ఏరియాలో క్యాథ్ ల్యాబ్ త్వరలో అందుబాటులోకి తెస్తామని హామీఇచ్చారు.