CNG గ్యాస్ ధరలు మళ్లీ పెంచిన కేంద్రం.. రెండ్రోజుల్లో రెండోసారి బాదుడు.. ఎంత పెంచారంటే..

CNG గ్యాస్ ధరలు మళ్లీ పెంచిన కేంద్రం.. రెండ్రోజుల్లో రెండోసారి బాదుడు.. ఎంత పెంచారంటే..

CNG గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. 2026 మే 17న కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (CNG) ధరలను పెంచారు. కేజీ కి రూపాయి చొప్పున పెంచాయి కంపెనీలు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలు పెరగటంతో సీఎన్జీ ధరలు పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. 

పెరిగిన ధరలతో ఢిల్లీలో సీఎన్జీ కేజీ ధర 80.09కి చేరుకుంది. అదే క్రమంలో నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో 88.70 కి చేరుకుంది. మే 15వ తేదీన కేజీ పైన 2 రూపాయలు పెంచిన తర్వాత.. మరో రెండు రోజుల గ్యాప్ లోనే రూపాయి పెంచడం గమనార్హం. దీంతో 48 గంటల్లోనే కేజీకి 3 రూపాయలు పెరిగినట్లైంది. 

హార్మూజ్ జలసంధి దగ్గర బ్లాకేడ్ కొనసాగుతుండటంతో చమురు సరఫరా క్లిష్టంగా మారినట్లు చెబుతున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో నష్టాలను భరించేందుకు పెంపు తప్పదని కంపెనీలు చెబుతున్నాయి.