జీడిమెట్ల, వెలుగు: కొకైన్ అమ్ముతున్న వ్యక్తితో పాటు కొనుగోలు చేయడానికి వచ్చిన ఆరుగురిని మేడ్చల్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సుచిత్రలో కొకైన్ అమ్ముతున్నారనే సమాచారంతో బుధవారం రాత్రి మేడ్చల్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు.
కొకైన్ అమ్ముతున్న మితిలేశ్ కుమార్‌తో పాటు కొనుగోలు చేయడానికి వచ్చిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4.5 గ్రాముల కొకైన్, యాక్టివా బైక్, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌కు చెందిన చోటు కుమార్ నగరంలోని ఓ హోటల్లో పనిచేస్తూ జార్ఖండ్ నుంచి కొకైన్ తెచ్చి మితిలేశ్ కుమార్‌కు ఇచ్చినట్లు విచారణంలో తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
