విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను తొలగించాలి..CJP పార్టీ ఆన్ లైన్ పిటిషన్

విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను తొలగించాలి..CJP పార్టీ ఆన్ లైన్ పిటిషన్

సీజేఐ కామెంట్స్ ను నిరసిస్తూ పుట్టిన కాక్రోచ్ జనతాపార్టీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి పెట్టింది.నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్  కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పేపర్ లీక్ తో విద్యార్థుల భవిషత్తు నాశనం అయింది.. ఎంతో మంది ఆత్మహత్య లు చేసుకున్నారు..దీనికి బాధ్యత వహిస్తూ  కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఆన్ లైన్ లో పిటిషన్ ఉంచింది. విద్యామంత్రిని తక్షణమే తొలగించాలని పిటిషన్ లో సంతకం చేయాలంటూ ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేశారు. వీడియో షేర్ చేసిన గంటలోనే లక్షకు పైగా జెన్ జెడ్ ఆన్ లైన్ పిటిషన్ ను ఫిల్ చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. 

హౌ ఆర్ యూ కాక్రోచ్ అంటూ వీడియో మొదటిపెట్టిన సీజేపీ ఫౌండర్ అభిజిత్ దిప్కే.. అసలు పని చేయాల్సిన సమయం వచ్చింది. ఇందుకోసం నేను ఇది స్టార్ట్ చేశాను. ఆన్ లైన్ లో పిటిషన్ ఉంచాను..అందులో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాం.. అందరూ  ఆన్ లైన్ పిటిషన్ నింపి సపోర్టు చేయాలని పిలుపునిచ్చారు. వ్యవస్థను బాధ్యత యుతంగా మార్చేందుకు సమయం వచ్చింది.. విద్యావ్యవస్థలతో లోపాలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయింది. వ్యవస్థలోని లోపాలతో నీట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మేం కోరుతున్నాం.. ఏదో ఒకటి జరగాలి.. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలి.. నాతో చేతులు కలపండి..ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.  

ఇక పోస్ట్ షేర్ చేసిన గంటలోనే లక్షకు పైగా ఆన్ లైన్ లో పిటిషన్ ను నింపారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు తమ శక్తిని చాటిచెప్పాలి..విద్యాశాఖ మంత్రి కనీసం విద్యావంతుడై ఉండాలని కోరారు.