నన్ను హీరోను చేయొద్దు.. ఇది మొదటి అడుగునే : సీజేపీ చీఫ్ దీప్కే

నన్ను హీరోను చేయొద్దు.. ఇది మొదటి అడుగునే : సీజేపీ చీఫ్ దీప్కే

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే స్పందించారు. ఇది దేశం విజయం.. ఇది దేశ యువత విజయం.. ఇది అందరి విజయం అంటూనే.. నన్ను హీరోను చేయొద్దు.. ఇది మొదటి విజయం మాత్రమే.. పోరాటం ఇంకా ఉంది.. ఉద్యమించాల్సింది ఇంకా ఉంది అంటూ మెసేజ్ ఇచ్చారు. ఇది భాతరదేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలకు దక్కిన విజయం అంటూనే.. ఎవరూ నన్ను హీరోను చేయొద్దు.. నేను హీరోను కాదు అంటూ దేశ యువతకు స్పష్టం చేశారు అభిజీత్ దిప్కే.

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్‎కు కేంద్రంలోని మోడీ సర్కార్ తలొగ్గింది. సీజేపీ డిమాండ్ మేరకు నీట్ పేపర్ లీక్‎కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ స్పందించింది. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా కాక్రోచ్ పార్టీ, విద్యార్థులు సాధించిన విజయని పేర్కొంది. 

ఈ పోరాటంలో విద్యార్థులు విజయం సాధించారని.. ప్రజాస్వామ్యం గెలిచిందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్‎ల సత్తా చూపించామని పేర్కొంది. కాక్రోచ్‎ల పోరాటం ఇక్కడితో ఆగదని.. విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని స్పష్టం చేసింది. తమ మూడు డిమాండ్లలో ఒకటి నెరవేరిందని.. మరో రెండు డిమాండ్లు కూడా నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

26 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మద్దతు వస్తుంది. మరోసారి దేశ వ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈ విషయాలపై ఇప్పటికే RSS సైతం తన వైఖరి వెల్లడించింది. పట్టువిడుపులు ఉండాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటించారు. ఈ పరిణామాలు అన్నీ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. రోజు రోజుకు యువత దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా చేస్తుండటంతో.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు.