- పారిపోతుండగా కాళ్లపై షూట్ చేసిన పోలీసులు
చెన్నై: తమిళనాడు కోయంబత్తూరు ఎయిర్‌పోర్ట్ సమీపంలో కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి విద్యార్థినిపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వారిని పట్టుకునేందుకు పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి గాలింపుచర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు నిందితుల ఆచూకీని గుర్తించారు.
అయితే, అరెస్ట్ చేసేందుకు వెళ్లగానే పారిపోవడానికి ప్రయత్నించడంతో ముగ్గురి కాళ్లపై పోలీసులు షూట్ చేశారు. అనంతరం వారిని అరెస్టు చేసి, ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితులను థావసి, కార్తీక్, కాళీశ్వరన్ గా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ స్పందిస్తూ..ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
