నవంబర్-3 నుంచి 10వ తేదీ వరకు మండలానికి 2 వేల మంది రైతులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు కాంగ్రెస్ లీడర్ పొన్నం ప్రభాకర్. పీసీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చెపడుతున్నామని చెప్పారు. కేంద్రంలో వ్యవసాయ సంక్షేమానికి వ్యతిరేకంగా మూడు బిల్లులు తెచ్చారని.. దీని వల్ల వ్యవసాయం కార్పొరేట్ శక్తుల చేతిలో కీలు బొమ్మలుగా మారే ప్రమాదం ఉందన్నారు. రైతులు వ్యాపారుల చేతిలో నష్టపోయే ప్రమాదం ఉందని..ఇది రైతుల సంక్షేమాన్ని తీవ్రంగా నష్టపరచడమే.. అందువల్ల ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేయనున్నామని తెలిపారు.
అలాగే రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. ప్రకృతి వైపరీత్యాలు వస్తే పంటల నష్టం లేదన్నారు. మద్దతు ధరలు లేవని..ఈ విషయాలపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రం వ్యవసాయ వ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ చేసి అటు రాష్ట్రపతి, ఇటు గవర్నర్ లకు వినతి పత్రాలు ఇస్తామన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ అబద్దాలు ఆడుతున్నారని.. మద్దతు ధరలకంటే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం లేదంటంటున్నారు. కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో తీర్మానాలు చేశాయి. మరి కేసీఆర్ ఎందుకు చేయలేదన్నారు. కేసీఆర్, మోడీ ఇద్దరు వ్యవసాయ, రైతు వ్యతిరేకులని.. ఈ విషయాలపై రైతులతో మాట్లాడి వారిని చైతన్య వంతులను చేస్తామన్నారు పొన్నం.
