తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు నటుడు సత్యదేవ్. ఆయన నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ మూవీ గురించి తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సినిమాలోని యూనిక్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ కాన్సెప్ట్‌తో వస్తోందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.
పెద్ది vs రావు బహదూర్..
ఈ ‘రావు బహదూర్’ చిత్రాన్ని జూన్ 5న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. అయితే, అదే తేదీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) కర్చీఫ్ వేయడంతో ఇప్పుడు సమీకరణాలు మారిపోయాయి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇలాంటి పెద్ద మూవీతో క్లాష్ అవ్వడం చిన్న , మిడ్-రేంజ్ సినిమాలకు రిస్క్ అని భావన టాలీవుడ్ లో నెలకొంది. వాస్తవానికి చరణ్ 'పెద్ది' మూవీ జూన్ 4న రిలీజ్ చేస్తారని ' రావ్ బహుదూర్ ' చిత్ర నిర్మాతలకు తెలియదు.
ముందుకు వెళ్తారా? వెనక్కి తగ్గుతారా?
ఇలాంటి పరిస్థితుల్లో 'రావ్ బహదూర్' వాయిదా పడుతుందా? లేదా అదే తేదీకి మొండిగా వెళ్తారా? అని ప్రస్తుతం సినీ వర్గాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. రామ్ చరణ్ సినిమా అంటే థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. అలాంటి సమయంలో సత్యదేవ్ లాంటి నటుడికి థియేటర్ల కేటాయింపు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఒకవేళ వాయిదా పడితే, మేకర్స్ ఏ విండోను ఎంచుకుంటారో అన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గానే ఉంది. మహేష్ బాబు హోమ్ బ్యానర్ GMB ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటంతో, సినిమా అవుట్‌పుట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
భారీ అంచనాలతో..
ఈ 'రావ్ బహదూర్' చిత్రంలో దీపా థామస్ కథానాయికగా నటిస్తుండగా, వికాస్ ముప్పల, బాల పరాశర్, ఆనంద్ భారతి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్, A+S మూవీస్ , మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘కేరాఫ్ కంచరపాలెం’తో మ్యాజిక్ చేసిన వెంకటేష్ మహా, ఈసారి సత్యదేవ్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక డ్రామా మాత్రమే కాదు, మనిషి ఆలోచనా విధానాన్ని ప్రశ్నించే సైకలాజికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.
►ALSO READ | భర్తను కిడ్నాప్ చేసిన భార్య.. నవ్వులు పూయిస్తున్న లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' ట్రైలర్!
'పెద్ది' రామ్ చరణ్ ఇందులో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది.. మరి జూన్ 5 బరిలో ఎవరు నిలుస్తారు? సత్యదేవ్ తన యూనిక్ కంటెంట్‌తో మెగా పవర్ స్టార్‌ను ఢీకొంటారా లేక సేఫ్ గేమ్ ఆడి మరో తేదీకి వెళ్తారా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.
