
ఘట్ కేసర్, వెలుగు: పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు అధికారులు బుధవారం ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులోని వాటర్శాంపిల్స్ను సేకరించారు. కలుషిత జలాలు కలవడంతో ఇటీవల చెరువులోని వేలాది చేపలు చనిపోయాయి. ఈ విషయమై మత్స్యకారులు, రైతులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన పీసీబీ అధికారులు బుధవారం చెరువు వద్దకు చేరుకుని వాటర్ శాంపిల్స్సేకరించారు. ల్యాబ్‌కు పంపించి టెస్ట్చేయనున్నామని, రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పీసీబీ ఏఈ శరత్ చంద్ర, ఎన్విరాన్ మెంట్ సైంటిస్ట్ మహేశ్ తెలిపారు. చెరువులోకి జవహర్నగర్డంప్యార్డు వ్యర్థ జలాలు, మురుగు నీరు చేరకుండా చూడాలని బీజేపీ నాయకుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి, మూసీ పరిరక్షణ సమితి కన్వీనర్ శంకర్ కోరారు.