మొగుళ్లపల్లి, వెలుగు: వర్షాకాలానికి ముందే అన్ని సంక్షేమ వసతి గృహాలు స్కూళ్లలో మరమ్మతు పనులు కంప్లీట్ చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని మొగుళ్లపల్లి ఎంజేపీ స్కూల్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్లో జరగాల్సిన మరమ్మతు పనులను పరిశీలించారు.
జిల్లాలోని ఆయా ఎంజేపీ మోడల్ రెసిడెన్షియల్ ప్రభుత్వ స్కూళ్లలో మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదనలు అందజేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. 31 స్కూళ్లలో చేపట్టిన మరుగుదొడ్ల పనులను కంప్లీట్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, డీఈవో రాజేందర్, బీసీ సంక్షేమ శాఖ ఆఫీసర్ ఇందిర తదితరులు పాల్గొన్నారు

