ఇష్టం వచ్చినట్లు డ్యూటీలు చేస్తే కుదరదు..పీహెచ్సీ స్టాఫ్పై కలెక్టర్ మండిపాటు

ఇష్టం వచ్చినట్లు డ్యూటీలు చేస్తే కుదరదు..పీహెచ్సీ స్టాఫ్పై కలెక్టర్ మండిపాటు

కాగజ్ నగర్, వెలుగు: డ్యూటీ చేయడం అంటే తమాషా గా ఉందా, ఇష్టం వచ్చినట్లు డ్యూటీలు చేస్తే కుదరదని కలెక్టర్ హరిత పీహెచ్​సీ సిబ్బందిపై మండిపడ్డారు. మంగళవారం ఆమె కౌటాల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

అక్కడ కేవలం సిబ్బంది మాత్రమే ఉన్నారు. డాక్టర్ పవన్ కల్యాణ్ రిజైన్ చేయగా రిజిస్టర్లు పరిశీలించారు. రిజిస్టర్ లో హాజరు పట్టికలో ఆబ్సెంట్ వేసింది. సిబ్బంది డ్యూటీకి రాకున్నా సెలవు పత్రాలు అలాగే ఉండడం, వాటిని నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జడ్పీ హైస్కూల్​తనిఖీ చేసి పదో తరగతి స్టూడెంట్స్ తో మాట్లాడారు. ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. తుమిడి హెట్టి వద్ద ప్రాణహిత నదిని పరిశీలించారు. ఆమె వెంట సర్పంచ్ శంకర్, ఉప సర్పంచ్ డబ్బా గోపాల్, ఎంపీడీవో ప్రసాద్, తహసీల్దార్ ప్రమోద్ ఉన్నారు.