నెల లోపు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా

నెల లోపు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా
  • మంజూరు పత్రాలు అందజేసిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా

ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులను నెల లోపు ప్రారంభించాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ ఝా సూచించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండో విడత కింద 643 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కేకే మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు నాలుగు దశల్లో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని స్పష్టం చేశారు.

నెలలో ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే రద్దయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. నిరుపేదలకు పెట్టుబడికి డబ్బులు లేకుంటే మహిళ సంఘాల నుంచి రూ. లక్ష రుణం అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్, మండల స్పెషల్ ఆఫీసర్ అఫ్జల్ బేగం, మార్కెట్ కమిటీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ సాబేరా బేగం, ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, తహసీల్దార్ సుజాత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సయ్య, మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.