ఎంసీఎంసీ పర్మిషన్ లేకుండా ప్రకటనలు ఇవ్వొద్దు : శశాంక

ఎంసీఎంసీ పర్మిషన్ లేకుండా ప్రకటనలు ఇవ్వొద్దు : శశాంక

ఎల్​ బీనగర్,వెలుగు: మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) పర్మిషన్ లేకుండా పోలింగ్ రోజు, ఒకరోజు ముందు ప్రింట్ మీడియాలో ఎలాంటి ఎన్నికల ప్రచార ప్రకటనలు ఇవ్వొద్దని రంగారెడ్డి జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  అభ్యర్థులు, ఇతరులు ఎవరైనా సరే ముందస్తుగా ఎంసీఎంసీ పర్మిషన్ కు దరఖాస్తు చేసుకుని ధ్రువీకరణ పొందాలని స్పష్టంచేశారు. 

లేకుంటే కేంద్ర ఎన్నికల సంఘం రూల్ ప్రకారం.. తగుచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే రీతిలో ఆవేశపూరిత, తప్పుదోవ పట్టించే, ద్వేషపూరిత ప్రకటనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబడదని కలెక్టర్ పేర్కొన్నారు.