
పుట్టగొడుగు.. అనగానే సాధారణంగా తెలుపు రంగులోనే ఉంటుందని అనుకుంటాం. కానీ ఆసిఫాబాద్ అడవుల్లోకి వెళ్తే... రంగురంగుల పుట్టగొడుగులు దర్శనమిస్తాయి. న్యూజిలాండ్ లో కనిపించే అరుదైన జాతి నీలి రంగు పుట్టగొడుగుతో పాటు ఆరెంజ్, ఎల్లో కలర్‌లో ఉన్న మష్రూమ్స్, గుండ్రంగా వెదురు బుట్ట మాదిరిగా ఉండే పుట్టగొడుగులు సైతం ఇక్కడ కనిపిస్తాయి.
కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్ సుఖ్‌దేవ్ బోబడే, ఫీల్డ్ బయాలజిస్ట్, ఫారెస్ట్ ఫొటోగ్రాఫర్ రాజేశ్ కన్నీ టీమ్ కొన్ని రోజులుగా అడవిలో తిరుగుతూ ఇలాంటి రకరకాల పుట్టగొడుగులను తమ కెమెరాల్లో బంధించారు. - ఆసిఫాబాద్/ కాగజ్‌నగర్, వెలుగు