ఊర్లో ఉన్న ఫీల్‌‌‌‌‌‌‌‌ తెప్పించే మెన్షన్ హౌస్ మల్లేష్

ఊర్లో ఉన్న ఫీల్‌‌‌‌‌‌‌‌ తెప్పించే మెన్షన్ హౌస్ మల్లేష్

శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో రాజేష్ నిర్మించిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. శుక్రవారం సినిమా విడుదలకానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ నిర్వహించారు.  హీరో శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ ‘ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక ఊర్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అంత నిజాయితీతో ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం.  ప్రేక్షకుల ఆదరణతోనే హీరోగా ఎవరికైనా మార్కెట్‌‌‌‌‌‌‌‌ క్రియేట్ అవుతుంది.  అందుకు తగ్గ మంచి కథ, టాలెంటెడ్‌‌‌‌‌‌‌‌ యాక్టర్స్‌‌‌‌‌‌‌‌, టెక్నీషియన్స్‌‌‌‌‌‌‌‌ దీనికి కుదిరారు. 

ఈ సినిమా నాకంటే నా టీం కోసం గెలవాలి. ఈ సినిమా గెలిస్తే ప్రతి ఒక్కరు గెలుస్తారు’ అని చెప్పాడు. ‘ఎంతో ప్యాషన్‌‌‌‌‌‌‌‌తో తీసిన ఈ సినిమాపై ఫుల్‌‌‌‌‌‌‌‌ కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాం’ అని నిర్మాత రాజేష్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. అందరూ రిలేట్‌‌‌‌‌‌‌‌ చేసుకునే జ్యోతి అనే పాత్రలో నటించానని హీరోయిన్ గాయత్రి రమణ చెప్పింది.  తన జర్నీలో ఇది ఇంపార్టెంట్‌‌‌‌‌‌‌‌ సినిమా అని కామాక్షి భాస్కర్ల తెలియజేసింది.  

తెలంగాణ బ్యాక్ డ్రాప్‌‌‌‌‌‌‌‌లో వస్తున్న చక్కని ఎమోషనల్ సినిమా అని  నటుడు రాజ్‌‌‌‌‌‌‌‌ కుమార్ కసిరెడ్డి చెప్పాడు.  పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందని మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి భరోసా వ్యక్తం చేశాడు.