హైదరాబాద్: శ్రీలంకలో కంబైన్డ్ డిస్ట్రిక్ట్ జట్టు పర్యటనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) గురువారం ఆమోదం తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యువ క్రికెటర్లకు ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియెన్స్ పొందడానికి, విదేశాల్లో ఆట పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ఈ టూర్ మంచి అవకాశాన్ని అందించనుంది.
జట్టు వివరాలు: జి. సాయి కృష్ణ (ఆదిలాబాద్), ఎ. రుత్విక్ సూర్య (కరీంనగర్), టి. హర్ష వర్ధన్ (నిజామాబాద్), టీవీఎస్ నారాయణ తేజ (ఖమ్మం), ఎండీ అఫ్రిది (మెదక్), ఎండీ అర్ఫాజ్ (మెదక్), వి.వైష్ణవ్ (వరంగల్), జి.పవన్ (వరంగల్), ఎస్కే. అజరు (ఖమ్మం), ఎస్కే. అబ్దుల్ జీషన్ (నల్గొండ), టి.అరుణ్ కుమార్ (మహబూబ్ నగర్), పి.లోకేశ్ (ఖమ్మం), డి. సాత్విక్ (కరీంనగర్), బి. భరత్ రెడ్డి (నల్గొండ), జి. గణేష్ (మహబూబ్ నగర్).
