హాస్యనటుడు వడివేలు ఇంట విషాదం

హాస్యనటుడు వడివేలు ఇంట విషాదం

ప్రముఖ హాస్యనటుడు వడివేలు(Vadivelu) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ​కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోదరుడు జగదీశ్వరన్‌(Jagadeeswaran)(55) ఆదివారం(ఆగస్టు 27) కన్నుమూశారు. కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవలే తమిళనాడు మధురైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. కాలేయ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతోనే చికిత్స పొందుతూ ఆదివారం తదిశ్వాస విడిచారు.

కాగా జగదీశ్వరీన్‌.. శింబు హీరోగా వచ్చిన కాదల్‌ అలైవిట్టలై సినిమాలో నటించారు కానీ.. ఆయనకు ఇండీస్ట్రీ నుండి అంతగా అవకాశాలు రాలేదు. దీంతో చెన్నై నుంచి మధురైకి వచ్చేశారు. అక్కడే ఒక రెడీ మేడ్ షాప్ నడిపించుకుంటూ జీవనం కొనసాగించాడు. ఇదిలా ఉండగా.. కొన్ని నెలల క్రితమే వడివేలు తల్లి మరణించారు. ఆ విషాదం నుండి తేరుకునేలోపే ఇప్పుడు ఆయన తమ్ముడు కూడా మరణించడంతో ఆయన ఇంట విషాదఛాయలు అలుమున్నాయి.