- రేకుల షెడ్లకు కమర్షియల్ కరెంట్ బిల్ వేస్తున్రు
- ఎమ్మెల్సీ కవితతో 9 బస్తీల వాసుల ఆవేదన
ఓయూ, వెలుగు: ఓయూ పరిధిలోని తొమ్మిది బస్తీల్లో రేకుల ఇండ్లకు కమర్షియల్కరెంట్బిల్లులు వస్తున్నాయంటూ స్థానికులు వాపోయారు. సోమవారం ఓయూలోని ఎంకేనగర్కు వచ్చిన ఎమ్మెల్సీ కవితను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. తాము నెలకు రూ.2,500 నుంచి రూ.3వేలు కరెంటు బిల్లు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న రేకుల ఇండ్లకు కమర్షియల్ బిల్ వేయడం ఏమిటన్నారు. డొమెస్టిక్ కిందకు మార్చి తమకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన కవిత ఓయూ వీసీతోపాటు విద్యుత్ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
