వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం జిల్లాకో కమిటీ

వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం జిల్లాకో కమిటీ

చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్లుగా జిల్లా ఇన్​చార్జ్ మంత్రి

హైదరాబాద్, వెలుగు: పోడు భూముల రెగ్యులరైజేషన్‌‌‌‌ దరఖాస్తుల విషయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం జిల్లాకో కమిటీని నియమిస్తూ సర్కార్‌‌‌‌‌‌‌‌ సోమవారం ఉత్తర్వులిచ్చింది. జిల్లా ఇన్​చార్జ్ మంత్రి కమి టీకి చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌, జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కన్వీనర్​గా వ్యవహరిస్తారని పేర్కొంది. ఎస్పీ లేదా పోలీస్ కమిషనర్‌‌‌‌‌‌‌‌, అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ (రెవెన్యూ), అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ (లోకల్ బాడీస్‌‌‌‌), డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌, డిస్ట్రిక్ట్‌‌‌‌ రూరల్ డెవలప్‌‌‌‌మెంట్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌, డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీ సర్‌‌‌‌‌‌‌‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆయా జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ స్పెషల్ ఇన్వైటీలుగా ఉంటారు. పోడు భూముల రెగ్యులరైజేషన్‌‌‌‌ తదితర వ్యవహారాల్లో వివిధ శాఖల మధ్య ఈ కమిటీ సమన్వయకర్తగా ఉంటుంది.