బీజేపీ, కాంగ్రెస్​ మధ్యే పోటీ : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

బీజేపీ, కాంగ్రెస్​ మధ్యే పోటీ : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి
  •   ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తం
  • వచ్చే నెల 4న జరిగే సభకు ప్రధాని మోదీ వస్తారు
  • ఈ నెల 20 నుంచి బస్సు యాత్రలుంటాయని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల 4న రాష్ర్టానికి ప్రధాని మోదీ రానున్నట్లు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ లో నిర్వహించే విజయసంకల్ప సభలో మోదీ పాల్గొంటారని, రాష్ట్రంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్టా సభలకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిలతో కలిసి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

  17 నియోజకవర్గాలను5 క్లస్టర్లుగా డివైడ్ చేసి, వాటికి  కుమ్రంభీమ్, శాతవాహన , కాకతీయ, భాగ్యనగరి, కృష్ణమ్మ యాత్రలుగా నామకరణం చేశామన్నారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల1 వరకు119 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా యాత్రలు చేపట్టబోతున్నామని, ఇందులో ఎక్కువ శాతం రోడ్ షో లు ఉంటాయని చెప్పారు. ఒకే రోజు 2 లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా యాత్ర సాగుతుందని తెలిపారు. రాష్ర్టంలో 17 ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, హైదరాబాద్ సీటులో ఎంఐఎంను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ ల మధ్యనే పోటీ ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు. 

మోదీనే మూడో సారి ప్రధాని

దేశంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రాకమందే బీజేపీ అధికారంలోకి వచ్చే వేవ్ వచ్చిందని, బీజేపీ అధికారంలోకి వస్తుందని, మూడో సారి మోదీనే ప్రధాని అవుతారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని నియోజకవర్గాల్లో  బీజేపీకి సానుకూల వాతావరణం కనపడుతున్నదన్నారు. మోదీకి ఎదురునిలబడే శక్తి ఏ కూటమికి లేదన్నారు. గతం కంటే ఈసారి బీజేపీకి అధికంగా సీట్లు వస్తాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి జిల్లాలోనూ మోదీ రావాలని 80 శాతం యువత  కోరుకుంటున్నానని ఆయన గుర్తు చేశారు. గత ఎన్నికల్లో తెలంగాణ లో 4 సీట్లు గెలిచామని, ఈ సారి ఎక్కువ సీట్లు గెలుస్తామన్నారు. ఈ ఎన్నికలు  కుటుంబ, అవినీతి పార్టీలకు.. -ధర్మం కోసం పనిచేస్తున్న