 
                                    - బైఎలక్షన్ ప్రచారంలో డబ్బుల ప్రస్తావనపై ఈసీఐని ఆశ్రయించిన వేణుగోపాలస్వామి
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ)కు కంప్లైంట్ అందింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కేటీఆర్ బహిరంగంగా డబ్బుల ప్రస్తావన తీసుకురావడాన్ని తప్పబడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్త, చార్టర్డ్ అకౌంటెంట్ వేణుగోపాలస్వామి ఈసీఐకి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు గురువారం ఢిల్లీలోని నిర్వచన్ సదన్ లో ఎలక్షన్ కమిషన్ కు వ్యక్తిగత ఫిర్యాదు కాపీని అందజేశారు. అనంతరం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ నేరుగా డబ్బులు తీసుకోవాలని ఓటర్లను సూచించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందజేసిన ఫిర్యాదు పత్రాన్ని మీడియాకు చూపించారు.

 
         
                     
                     
                    